ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, జర్నలిస్టు కుటుంబాలకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పరామర్శ
జగిత్యాల జిల్లా, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : జగిత్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎశమేని గణేష్ నానమ్మ రాజవ్వ ఇటీవల మృతి చెందడంతో, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. గణేష్తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే...