పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచం లాంటిది - మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 29 (సమాజహితం న్యూస్) : పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచం లాంటిదని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గురువారం సురక్షిత బచ్ పన్ అభియాన్ స్కీమ్ కింద జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు వయసున్న ప్రతి విద్యార్తిని, విద్యార్థులు పోక్సో చట్టం యొక్క నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రభుత్వం రూపొందించిన చట్టాల రక్షణతో పాటూ, చట్టం యొక్క ప్రయోజనాల్ని పొందాలని సూచించారు. దగ్గరి...