ఉపాధి హామీ లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం సహించేది లేదు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా, పెగడపల్లి, అక్టోబర్ 30 (సమాజహితం) : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతో పాటు జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ నిరంతరం ఉపాధి కల్పించాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత గ్రామ, మండల స్థాయి అధికారులతో పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే 2027 జూన్, జూలై నెలల వరకు ఉపాధి హామీ పనుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు అదనపు పనులను గుర్తించి తగినన్ని అంచనాలు రూపొందించి ముందస్తుగా...