రైతులందరికీ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, అక్టోబర్ 30 (సమాజహితం న్యూస్) : రైతుల సమగ్ర వివరాల సేకరణలో భాగంగా ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. అగ్రి స్టాక్, వ్యవసాయ యాంత్రీకరణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ ఏర్పాట్లపై శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రైతులకు సంబంధించిన...