గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా, గొల్లపల్లి, అక్టోబర్ 30 (సమాజహితం న్యూస్) : గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టి, భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గొల్లపల్లి మండలంలోని అగ్గిమల్ల, గంగాదేవి పల్లి గ్రామాల్లో పర్యటించి, గ్రామాల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనులు, ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులను తనిఖీ చేసి, పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ప్రతి...