మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 31 (సమాజహితం) : మెట్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, వైద్య సిబ్బంది హాజరు, మందుల లభ్యత తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా...