దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందాం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 31 (సమాజహితం) : దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ప్రతిజ్ఞలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను మరియు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం...