మెట్ పల్లి లో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం!
- కార్మిక హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీ నిరంతర పోరాటం! - జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్! జగిత్యాల జిల్లా, అక్టోబర్ 31 (సమాజహితం): భారతదేశ తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో ఏఐటీయూసీ జెండాను జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్ ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడుఎశమేని గణేష్ మాట్లాడుతూ, భారతదేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. ఏఐటీయూసీ నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా కార్మికులకు అనేక చట్టాలు, హక్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత,...