రాప్తాడు స్కూల్‌ ఘటన పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు..!

రాప్తాడు జడ్పీ హైస్కూల్లో విద్యార్థినులపై జరిగిన దాడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటన రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు, జంగిల్‌రాజ్‌కు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. విద్యాసంస్థల్లో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలని ఆయన కోరారు. ఈ దారుణ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన అమానుష దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులంతా...