చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు: నారా లోకేశ్
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండె బరువెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. "చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది," అని ఆయన అన్నారు. ఆడపిల్లలు, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని, ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని లోకేశ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే వాతావరణం సృష్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. పిల్లల భద్రత విషయంలో...