ILPA 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
ILPA 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి కామారెడ్డిలో మహాసభల కరపత్రాలు ఆవిష్కరించిన న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ (ILPA) ఆధ్వర్యంలో ఈ నెల 14న వరంగల్లో నిర్వహించనున్న 6వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ILPA నాయకులు అడ్వకేట్ సిద్ధిరాములు, BAMCEF రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, BVM రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవాదుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం, న్యాయవ్యవస్థలో సమాన అవకాశాల సాధన కోసం...