పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ అధికారుల తనిఖీలు

జగిత్యాల, కోరుట్ల, నవంబర్ 06 (సమాజహితం): కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి రెండు హోల్ సేల్ బియ్యం దుకాణాలు, ఆరు రిటైల్ బియ్యం దుకాణాలు, ఒక రైస్ మిల్లును తనిఖీ చేశారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. ఈ తనిఖీల్లో రెండు వ్యాపార సంస్థలు బియ్యం బస్తాలపై అసలు ధరల లేబుళ్లను మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దుకాణాలు, గోదాముల్లో బియ్యం నిల్వలు, ధరల పట్టికలు, తూకాలు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి, రోజువారీ నిల్వలు, విక్రయ...