ఇంట్లో బంగారం చోరీ చేసిన కుమారుడి స్నేహితుడు - అరెస్ట్
జగిత్యాల, మెట్ పల్లి, నవంబర్ 06 (సమాజహితం): మెట్ పల్లి పట్టణం రెడ్డి కాలనీకి చెందిన తలారి లావణ్య (ప్రేమలత) ఇంట్లోని బీరువా లాకర్ లో ఉన్న సుమారు 4.5 తులాల బంగారు పెద్ద గొలుసు, 2 తులాల నగరు నెక్లెస్, 0.5 తులాల కమ్మలు, బుట్టలు, 0.5 తులం పతనపు ఉంగరం, 0.5 తులం బంగారు మాటీలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మెట్ పల్లి ఎస్సై పి. కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. తలారి లావణ్య తన కుమారుడు అభినవ్ యొక్క స్నేహితుడు అయిన ఇందూరి నవీన్ పై...