గాంధారి మండలంలో దారుణ హత్య.. పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వచ్చిన యువతి హతం!
గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పత్రికలు అందించేందుకు సొంతూరికి వచ్చిన ఓ యువతి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గాంధారి మండల కేంద్రంలోని అంగడి బజార్ సెల్ టవర్ సమీపంలో నివాసముండే సిక్కు మతానికి చెందిన ఆర్.సీ. కౌర్ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్లో నివసిస్తోంది. ఇటీవల ఆమెకు వివాహ సంబంధం కుదరడంతో, తన పెళ్లి శుభలేఖలను బంధువులు, పరిచయస్తులకు అందించేందుకు శుక్రవారం స్వగ్రామమైన గాంధారికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సెల్ టవర్ సమీపంలో...