భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం

కామారెడ్డి: బాంసెఫ్ అనుబంధ విద్యార్థి సంఘమైన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ప్రకటించింది. బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో నూతన కమిటీ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్‌ను, జిల్లా కో-కన్వీనర్‌గా భానుప్రసాద్‌ను నియమించారు. ఈ నియామకంలో బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నా చదువు – నా సమాజం కోసం” అనే నినాదంతో భారతీయ విద్యార్థి మోర్చా విద్యార్థుల్లో సామాజిక...