వెలమ కార్పొరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, సమాజహితం : తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనలాంటి ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు, ప్రోటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఈ అవకాశం కల్పించారని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వెలమ సామాజిక వర్గంలోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారు ఉన్నారని, గత...