ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 10 (సమాజహితం): ప్రజావాణి ద్వారా అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ, డీఆర్ఓ కె.వై. ప్రసాద్, ఆర్డీఓ లు మధుసూదన్,...