నాయబ్ తహసీల్దార్ శృతికి అంబేద్కర్ సంఘం నాయకుల ఘన సన్మానం

తాడ్వాయి (సమాజహితం) : మండల నూతన నాయబ్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారి శృతిని తాడ్వాయి మండల అంబేద్కర్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన బాధ్యతల్లో ఆమె విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం, బదనకంటి సంతోష్, పులి ప్రభాకర్, గైని సంజీవ్, గడ్డం రవీందర్, సముద్రాల అఖిల్, చిట్యాల జీపీఓతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.