అభివృద్ధి పనుల్లో సర్పంచులకు ప్రాధాన్యత కరువు..మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆవేదన!
అభివృద్ధి పనుల్లో సర్పంచులకు ప్రాధాన్యత కరువు! అధికారుల తీరుపై సర్పంచుల అసహనం.. మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆవేదన తాడ్వాయి: గ్రామస్థాయిలో అభివృద్ధి పనుల నిర్వహణలో సర్పంచులకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని పలువురు సర్పంచులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచులు తమ సమస్యలను, ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు...