డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి.. బీజేపీ ఎంపీల పిలుపు.
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి.. బీజేపీ ఎంపీల పిలుపు. గండిపేటలో నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ యువతకు అవగాహన.. హైదరాబాద్: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. గురువారం గండిపేట చౌరస్తా నుంచి PIS వరకు నిర్వహించిన 'నషా ముక్త్ భారత్' సైకిల్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, BJYM జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ హేమంగ్ జోషి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ...