ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
సోమారం పాఠశాల అభివృద్ధికి రూ.27.10 లక్షల నాబార్డ్ నిధులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు తాడ్వాయి: మండలంలోని సోమారం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (MPUPS) అభివృద్ధికి నాబార్డ్ నిధుల ద్వారా రూ.27 లక్షల 10 వేల నిధులు మంజూరు కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం పాఠశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...