కొమరబండలో 13 మందికి నూతన పింఛన్లు పంపిణీ
కొమరబండలో 13 మందికి నూతన పింఛన్లు పంపిణీ అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం: సర్పంచ్ పద్మ గోపాల్ షాబాద్:నవంబర్:13, సమాజహితం: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా షాబాద్ మండలం కొమరబండ గ్రామానికి చెందిన 13 మంది అర్హులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా షాబాద్లోని ఎం.ఎస్. గార్డెన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పద్మ గోపాల్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక చొరవ తీసుకున్నామని తెలిపారు....