పోగొట్టుకున్న పర్సు అప్పగించి.. నిజాయితీ చాటుకున్న తొంట వెంకటేష్!

పోగొట్టుకున్న పర్సు అప్పగించి.. నిజాయితీ చాటుకున్న తొంట వెంకటేష్! రూ.3,540 నగదు, ఆధార్ కార్డుతో సహా మహిళకు తిరిగి అందజేత వెంకటేష్ నిబద్ధతకు ఎస్సై విజయ్ కుమార్ ప్రశంసలు..శాలువాతో ఘన సన్మానం షాబాద్, నవంబర్ 19 (సమాజహితం): నిజాయితీకి డబ్బుతో వెలకట్టలేమని, మానవత్వానికి మించిన సంపద మరొకటి లేదని షాబాద్ గ్రామానికి చెందిన తొంట వెంకటేష్ నిరూపించారు. రోడ్డుపై దొరికిన పర్సును తనది కానప్పుడు తనకెందుకనే బాధ్యతతో పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఆయన చూపిన నిజాయితీ స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. షాబాద్ మండలంలోని దామాలపల్లి గ్రామానికి చెందిన ఇటిక యాదమ్మ షాబాద్ బస్టాండ్ సమీపంలో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో నగదు, ఆధార్ కార్డు,...