Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. ఏండ్రియాల్ గ్రామంలో ఘనంగా దీపావళి సంబరాలు.. ఆనందోత్సాహాల్లో లబ్ధిదారులు!

Author SAMAJA HITHAM | 08 Nov 2026, 08:23 PM | TELANGANA, కామారెడ్డి
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. ఏండ్రియాల్ గ్రామంలో ఘనంగా దీపావళి సంబరాలు.. ఆనందోత్సాహాల్లో లబ్ధిదారులు!

తాడ్వాయి, సమాజహితం: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారులు ఈ ఏడాది దీపావళి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు దీపావళి సంబరాలను వైభవంగా నిర్వహించారు.

కొత్త ఇళ్లలో దీపాల వెలుగులు నింపుకుంటూ, టపాసులు కాలుస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ ఆనందం రెట్టింపైంది. ప్రతి ఇంటా దీపాల కాంతులు, పండుగ సందడి నెలకొంది.

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. ఏండ్రియాల్ గ్రామంలో ఘనంగా దీపావళి సంబరాలు.. ఆనందోత్సాహాల్లో లబ్ధిదారులు! - Additional Image

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయని, పండుగ పూట వారి ఆనందాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. ఏండ్రియాల్ గ్రామంలో ఘనంగా దీపావళి సంబరాలు.. ఆనందోత్సాహాల్లో లబ్ధిదారులు! - Additional Image