Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

నాయబ్ తహసీల్దార్ శృతికి అంబేద్కర్ సంఘం నాయకుల ఘన సన్మానం

Author SAMAJA HITHAM | 10 Nov 2026, 07:54 PM | TELANGANA, కామారెడ్డి
నాయబ్ తహసీల్దార్ శృతికి అంబేద్కర్ సంఘం నాయకుల ఘన సన్మానం


తాడ్వాయి (సమాజహితం) : మండల నూతన నాయబ్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారి శృతిని తాడ్వాయి మండల అంబేద్కర్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

అనంతరం నూతన బాధ్యతల్లో ఆమె విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం, బదనకంటి సంతోష్, పులి ప్రభాకర్, గైని సంజీవ్, గడ్డం రవీందర్, సముద్రాల అఖిల్, చిట్యాల జీపీఓతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి