Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Author SAMAJA HITHAM | 21 Sep 2026, 10:20 PM | జగిత్యాల
గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, సెప్టెంబర్ 21 (సమాజహితం ప్రతినిధి) : ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.