Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

పోక్సో చట్టంపై అవగాహనతోనే నష్టాల నివారణ - సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్

Author SAMAJA HITHAM | 27 Oct 2026, 01:01 AM | జగిత్యాల
పోక్సో చట్టంపై అవగాహనతోనే నష్టాల నివారణ - సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్

జగిత్యాల, మెట్ పల్లి, అక్టోబర్ 26 (సమాజహితం న్యూస్): పోక్సో చట్టంపై అవగాహనతోనే అనేక నష్టాలను నివారించుకోవచ్చని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం సురక్షిత్ బచ్ పన్ అభియాన్ స్కీమ్ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు వయసున్న ప్రతి విద్యార్థిని, విద్యార్థులు పోక్సో చట్టం యొక్క నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు వారు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గూర్చి రహస్యంగా దాచుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, న్యాయవాదులు జేడి సుధాకర్, డా. తుల రాజేందర్, బాస రాములు, ప్రధానోపాధ్యాయులు రామానుజం, ఉపాధ్యాయులు మధుచందర్, తదితరులు పాల్గొన్నారు.