Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

మస్కట్‌లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

Author SAMAJA HITHAM | 31 Oct 2026, 04:34 PM | అంతర్జాతీయం
మస్కట్‌లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు.

ఈ మహోత్సవానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి కల్యాణ వేడుకను భక్తితో తిలకించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

మస్కట్‌లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం - Additional Image

విదేశీ గడ్డపై సైతం హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకతో మస్కట్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి