Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన మండల వ్యవసాయ అధికారి దండెం విజయ చంద్ర

Author SAMAJA HITHAM | 08 Nov 2026, 08:48 AM | TELANGANA, రంగారెడ్డి
రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన మండల వ్యవసాయ అధికారి దండెం విజయ చంద్ర

షాబాద్, నవంబర్:7, సమాజహితం: షాబాద్ మండలంలోని మన్‌మర్రి గ్రామంలో వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ భూసార పరీక్షల ప్రాముఖ్యత, సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ ఎరువులు, పంట అవశేషాల నిర్వహణ, నీటి సంరక్షణ, సమగ్ర సస్యరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు వివరించారు.

ఎల్‌నినో నేపథ్యంలో ఈ యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగించకుండా భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేసిన మోతాదులోనే వాడాలని కోరారు.

ఇవి కూడా చదవండి

పంట అవశేషాలను కాల్చకుండా, నీటిని పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల సారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాలపేట బందయ్య, ఉపసర్పంచ్ బేగరి శంకరయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు తదితరులు పాల్గొన్నారు