Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

పలు గ్రామాల అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి

Author SAMAJA HITHAM | 08 Nov 2026, 08:52 AM | TELANGANA, రంగారెడ్డి
పలు గ్రామాల అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి

షాబాద్:నవంబర్ 7 సమాజహితం :
షాబాద్ మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనం, పోలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ, మహిళా సంఘం భవనాలు, గోపిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మహిళా సంఘాల భవనాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ అపర్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటా రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.