Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

విలేకరి సతీమణికి శస్త్ర చికిత్స..పరామర్శించిన టీపీసీసీ సీనియర్ నాయకులు విజయ్ ఆజాద్!

Author SAMAJA HITHAM | 18 Nov 2026, 10:33 AM | TELANGANA, జగిత్యాల
విలేకరి సతీమణికి శస్త్ర చికిత్స..పరామర్శించిన టీపీసీసీ సీనియర్ నాయకులు విజయ్ ఆజాద్!

విలేకరి సతీమణికి శస్త్ర చికిత్స..పరామర్శించిన టీపీసీసీ సీనియర్ నాయకులు విజయ్ ఆజాద్!
మెట్‌పల్లి, నవంబర్ 17 (సమాజహితం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దిశ పత్రిక విలేకరి లింగారెడ్డి సతీమణి లావణ్యకు ఈ నెల 6వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొమిరెడ్డి రాములు – జ్యోతక్క దంపతుల కుమారుడు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ మంగళవారం లింగారెడ్డి నివాసానికి వెళ్లి లావణ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విజయ్ ఆజాద్ వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాలీద్, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల హనుమండ్లు, అడ్వకేట్ సురభి అశోక్, టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి దశరథం తదితరులు ఉన్నారు.