Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా!

Author SAMAJA HITHAM | 05 Sep 2026, 04:52 PM | జగిత్యాల
మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా!

మెట్‌పల్లి, సెప్టెంబర్ 05 (సమాజహితం) : విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపడతామని, విద్యార్థులకు స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందని ఎమ్మెల్యే విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మొండివైఖరి వీడి విద్యార్థులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందడం లేదని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, GO 97ను రద్దు చేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, యువత, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా! - Additional Imageమెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా! - Additional Image