Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి..!!

Author SAMAJA HITHAM | 09 Sep 2026, 03:38 PM | భద్రాచలం
ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి..!!

భద్రాచలం, సెప్టెంబర్ 09 (సమాజహితం): ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ను కోరారు.

బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ గ్రామాలు ఏపీలో ఉండటంతో భద్రాచలం పట్టణానికి పరిపాలన, పారిశుద్ధ్యం, విద్య, శ్మశాన వాటిక తదితర సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 900 ఎకరాల భూమి ఏపీ పరిధిలో ఉండటంతో అభివృద్ధి, ఆక్రమణల నియంత్రణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. భద్రాచలం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కేంద్రం చొరవ చూపాలని వీరయ్య విజ్ఞప్తి చేశారు.