Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి

Author SAMAJA HITHAM | 11 Sep 2026, 01:08 AM | జగిత్యాల
22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి

22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి
అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్

కొడిమ్యాల, సెప్టెంబర్ 10 (సమాజహితం): మండలంలోని సుమారు 24 గ్రామపంచాయతీల పరిధిలో వందల ఎకరాల భూములను 22-ఏ జాబితాలో చేర్చడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం కొడిమ్యాల తహసీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. 22-ఏ సమస్యను అధికారులు తక్షణమే పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షైన్ మల్లేశం, మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.