Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

నూతన బాధ్యతలు పొందిన NSUI నాయకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అభినందనలు!

Author SAMAJA HITHAM | 11 Sep 2026, 07:18 PM | జగిత్యాల
నూతన బాధ్యతలు పొందిన NSUI నాయకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అభినందనలు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): ఇటీవల NSUI రాష్ట్ర కార్యవర్గంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పోల్కం శివ ఆధ్వర్యంలోని NSUI బృందం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నదయ్యాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నదయ్యా నూతన బాధ్యతలు పొందిన నాయకులను అభినందించారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ విలువైన సూచనలు, ఆశీస్సులు అందించారు.

నూతన బాధ్యతలు పొందిన NSUI నాయకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అభినందనలు! - Additional Image

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేంద్ర రెడ్డి, వెంపెట్ ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్, NSUI మెట్‌పల్లి పట్టణ ఉపాధ్యక్షులు సమీర్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా NSUI నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, NSUIని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

తమను అభినందించి, ప్రోత్సహిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నదయ్యాకు NSUI నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన ప్రోత్సాహం తమపై మరింత బాధ్యతను పెంచడంతో పాటు కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అందించిందని వారు పేర్కొన్నారు.