Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

ముందస్తుగా ఇంజనీరింగ్ డే వేడుకలు

Author SAMAJA HITHAM | 11 Sep 2026, 07:20 PM | జగిత్యాల
ముందస్తుగా ఇంజనీరింగ్ డే వేడుకలు

జగిత్యాల/ మెట్‌పల్లి, సెప్టెంబర్ 11 ( సమాజహితం ) : మెట్‌పల్లి పట్టణంలో జిందాల్ పాంథర్ స్టీల్ కంపెనీ మీనాక్షి ట్రేడర్ వారి తరపున మెట్‌పల్లి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ముందస్తుగా శుక్రవారం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శశి కుమార్, ఉపాధ్యక్షులు గౌతం, కార్యదర్శి శ్యామ్ సుందర్, సహ కార్యదర్శి సంకీర్త్ గౌడ్, కోశాధికారి సాయి కిరణ్, ఇంజనీర్లు అశోక్, మసూద్ రెహమాన్, వంశీ, గిరిధర్, రోహన్, పవన్, చరణ్, రవీందర్, మీనాక్షి ట్రేడర్ బార్ల హనుమంతు, టిజి అండ్ ఏపి బ్రాంచ్ హెడ్ సమంత రాయ్, జగిత్యాల సేల్స్ గిరీష్, తదితరులు పాల్గొన్నారు.