Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా పూడుకారపు నవీన్ రెడ్డి

Author SAMAJA HITHAM | 17 Sep 2026, 12:08 AM | జగిత్యాల
జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా పూడుకారపు నవీన్ రెడ్డి

జగిత్యాల ప్రతినిధి, (సమాజహితం): జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ ఎన్నికలు బుధవారం మెట్ పల్లి లో ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పూడుకారపు నవీన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని పౌల్ట్రీ రంగానికి చెందిన ప్రతినిధులు, సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో నవీన్ రెడ్డికి సభ్యుల నుంచి విశేష మద్దతు లభించడంతో ఆయన ఘన విజయం సాధించారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నవీన్ రెడ్డికి పౌల్ట్రీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సభ్యులు, అభిమానులు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నవీన్ రెడ్డి తెలిపారు. పౌల్ట్రీ రంగం అభివృద్ధికి సభ్యులందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. నవీన్ రెడ్డి ఎన్నికతో పౌల్ట్రీ యూనియన్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా మెట్ పల్లి లో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.