Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి

Author SAMAJA HITHAM | 17 Sep 2026, 12:28 AM | జగిత్యాల
మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి

మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి

మున్సిపల్ చైర్‌పర్సన్‌ మైలారపు లింబాద్రికి నియోజకవర్గ సాధన సమితి వినతి!


జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 16 (సమాజహితం): మెట్ పల్లి రైల్వే స్టేషన్‌ గుండా వెళ్లే ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మెట్ పల్లి స్టేషన్ లో హాల్ట్ కల్పించాలని కోరుతూ మెట్ పల్లి నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు. మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పించాల్సిన అవసరం ఉందని వారు కోరారు.
మెట్ పల్లి పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను సంబంధిత రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మెట్టుపల్లిలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించేలా కృషి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కోరారు. అలాగే మున్సిపల్ పాలకవర్గంలో తీర్మానం చేసి సంబంధిత రైల్వే మంత్రి గారికీ,స్థానిక ఎంపీ అర్వింద్ గారికీ, మరియు రైల్వే అధికారులకు పంపించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షుడు తోకల సత్యనారాయణ, నాంపల్లి గట్టయ్య, దేశ రాజు దేవలింగం, అచ్చ లింగం గుంటుక సదాశివ్, మార్గం లింగారెడ్డి, బొక్కినపల్లి నాగరాజు, నిరటి రాజేందర్, అంబల్ల జగదీశ్వర్, సుంకే అశోక్, గుర్రాల విక్రమ్, గజేల్లి సుధాకర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.