Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

ఎంప్లాయిస్ యూనియన్ మెట్ పల్లి నూతన డిపో కమిటీ నియామకం!

Author SAMAJA HITHAM | 27 Oct 2026, 12:56 AM | జగిత్యాల
ఎంప్లాయిస్ యూనియన్ మెట్ పల్లి నూతన డిపో కమిటీ నియామకం!

జగిత్యాల, మెట్ పల్లి, అక్టోబర్ 26 ( సమాజహితం న్యూస్ ) : ఎంప్లాయిస్ యూనియన్ మెట్ పల్లి నూతన డిపో కమిటీ నియామకం జరిగినట్లు నాయకులు తెలిపారు. సోమవారం మెట్ పల్లిలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ అధ్యక్షులు ఎల్. ప్రకాష్, రీజనల్ కార్యదర్శి కొమ్మ కొమురయ్య యాదవ్, రీజనల్ కమిటీ మెంబర్ గణపతి పాల్గొని, మెట్ పల్లి మండల ఏఐటీయూసీ ఇంచార్జి ఎండి ఉస్మాన్ అధ్యక్షతన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా ఎండి ఉస్మాన్, ముఖ్య సలహాదారుగా ఏఎస్ చారి, అధ్యక్షుడిగా జేపీ రెడ్డి, డిపో సెక్రటరీగా ఆర్. శ్రీనివాస్, ట్రెజరర్ గా జి. లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ వై రెడ్డి, ఉపాధ్యక్షులుగా బి. వసంతరావు, సహాయ కార్యదర్శిగా కే. సత్తయ్య, ప్రచార కార్యదర్శిగా డి. శ్రీనివాస్, గ్యారేజ్ సెక్రెటరీగా పద్మ శ్రీనివాస్ తో పాటు వివిధ విభాగాల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.