Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Author SAMAJA HITHAM | 27 Oct 2026, 10:49 PM | జగిత్యాల
రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 30 ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించడం అత్యంత కీలకమని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందేలా సహకరించాలని ప్రజలకు సూచించారు. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని, ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.