Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, జర్నలిస్టు కుటుంబాలకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పరామర్శ

Author SAMAJA HITHAM | 27 Oct 2026, 11:02 PM | జగిత్యాల
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, జర్నలిస్టు కుటుంబాలకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పరామర్శ

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : జగిత్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎశమేని గణేష్ నానమ్మ రాజవ్వ ఇటీవల మృతి చెందడంతో, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. గణేష్‌తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగుల గోపాలచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, జిల్లా కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యుడు భాషెట్టి హరీష్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షుడు అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి