Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

రాప్తాడు స్కూల్‌ ఘటన పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు..!

Author SAMAJA HITHAM | 01 Nov 2026, 12:22 AM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
రాప్తాడు స్కూల్‌ ఘటన పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు..!

రాప్తాడు జడ్పీ హైస్కూల్లో విద్యార్థినులపై జరిగిన దాడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటన రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు, జంగిల్‌రాజ్‌కు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. విద్యాసంస్థల్లో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలని ఆయన కోరారు. ఈ దారుణ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన అమానుష దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులంతా చూస్తుండగానే ఓ దుండగుడు చొరబడి చెట్లను నరికే యంత్రంతో విద్యార్థినులపై దారుణంగా దాడి చేశాడు. పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు, జంగిల్‌రాజ్‌కు ఈ సంఘటన అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలోకి ఓ దుండగుడు యథేచ్ఛగా చొరబడి ఇంతటి ఘాతుకానికి పాల్పడటం విద్యాసంస్థల్లో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు."విద్యా సంస్థల్లో పిల్లలకు తగిన భద్రత కల్పించడంలో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడడం అత్యంత దురదృష్టకరం" అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే దాడిని అడ్డుకోబోయిన మరో విద్యార్థిని సైతం గాయపడటం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి, 'రెడ్ బుక్' పాలన పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నేరస్థులు చట్టమంటే భయం లేకుండా చెలరేగిపోతున్నారని జగన్ ఆరోపించారు.అదే విధంగా గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలోని పాఠశాలల్లో భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలని ఆయన కోరారు. ఈ దారుణ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాగా రాప్తాడు హైస్కూల్ హెచ్‌ఎం రాజేశ్వరిని అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.