Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ అధికారుల తనిఖీలు

Author SAMAJA HITHAM | 06 Nov 2026, 09:58 PM | TELANGANA, జగిత్యాల
పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ అధికారుల తనిఖీలు

జగిత్యాల, కోరుట్ల, నవంబర్ 06 (సమాజహితం): కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి రెండు హోల్ సేల్ బియ్యం దుకాణాలు, ఆరు రిటైల్ బియ్యం దుకాణాలు, ఒక రైస్ మిల్లును తనిఖీ చేశారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. ఈ తనిఖీల్లో రెండు వ్యాపార సంస్థలు బియ్యం బస్తాలపై అసలు ధరల లేబుళ్లను మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దుకాణాలు, గోదాముల్లో బియ్యం నిల్వలు, ధరల పట్టికలు, తూకాలు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి, రోజువారీ నిల్వలు, విక్రయ ధరలు వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి పత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బియ్యం అక్రమ నిల్వలు, ధరల ట్యాంపరింగ్ పై నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి జితేంధర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూనికల కొలతల అధికారి బి. ప్రవీణ్ కుమార్, పౌర సరాఫరాల అధికారులు డిటిసిఎస్ ఉమాపతి, ఎఫ్ఐ రాజేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.