Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

అభివృద్ధి పనుల్లో సర్పంచులకు ప్రాధాన్యత కరువు..మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆవేదన!

Author SAMAJA HITHAM | 10 Nov 2026, 08:00 PM | TELANGANA, కామారెడ్డి
అభివృద్ధి పనుల్లో సర్పంచులకు ప్రాధాన్యత కరువు..మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆవేదన!

అభివృద్ధి పనుల్లో సర్పంచులకు ప్రాధాన్యత కరువు!

అధికారుల తీరుపై సర్పంచుల అసహనం.. మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆవేదన

తాడ్వాయి: గ్రామస్థాయిలో అభివృద్ధి పనుల నిర్వహణలో సర్పంచులకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని పలువురు సర్పంచులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచులు తమ సమస్యలను, ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచిస్తున్నప్పటికీ అధికారులు తమ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.

తాము ప్రతిపాదించిన పనులను పక్కనపెట్టి ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా సూచించిన పనులను సైతం పట్టించుకోకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులుగా గ్రామాల అభివృద్ధిపై తమకు బాధ్యత ఉందని, అలాంటప్పుడు అభివృద్ధి పనుల నిర్ణయాల్లో తమను భాగస్వాములను చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధి సజావుగా సాగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, సర్పంచుల సూచనలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.