Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి.. బీజేపీ ఎంపీల పిలుపు.

Author SAMAJA HITHAM | 12 Nov 2026, 01:33 PM | TELANGANA, హైదరాబాద్
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి.. బీజేపీ ఎంపీల పిలుపు.

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి.. బీజేపీ ఎంపీల పిలుపు.

గండిపేటలో నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ
యువతకు అవగాహన..

హైదరాబాద్‌: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.

గురువారం గండిపేట చౌరస్తా నుంచి PIS వరకు నిర్వహించిన 'నషా ముక్త్ భారత్' సైకిల్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్‌, BJYM జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ హేమంగ్ జోషి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.

డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతలో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.

అనంతరం PIS ప్రాంగణంలో యువ క్రీడాకారులతో నిర్వహించిన క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని క్రికెట్ మ్యాచ్ ఆడారు.

ఉదయం 8 గంటలకు యువ సాధకులతో అల్పాహార సమావేశం నిర్వహించారు.
యువతలో చైతన్యం తీసుకురావడం, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం, క్రీడల అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.