Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

షాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ

Author SAMAJA HITHAM | 14 Nov 2026, 08:50 AM | TELANGANA, రంగారెడ్డి
షాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ

షాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ

రూ.10 లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో 14వ వార్డులో నూతన రోడ్డు ప్రారంభం

షాబాద్, నవంబర్ 13: సమాజహితం
షాబాద్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా షాబాద్ పట్టణంలోని 14వ వార్డులో హెచ్‌ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన నూతన రోడ్డును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మండల స్థాయి సమీక్ష సమావేశం

అనంతరం షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష, సామర్థ్య వృద్ధి శిక్షణ సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు.

అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ

అనంతరం షాబాద్‌లోని ఎంఎస్ గార్డెన్‌లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ జి. వెంకట నారాయణ, ఎంపీడీఓ అపర్ణ, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్దార్‌నగర్ మార్కెట్ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.