Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

76 జీఓ అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి

Author SAMAJA HITHAM | 19 Sep 2026, 12:28 AM | తాజా వార్తలు
76 జీఓ అమలు చేసి   సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి

76 జీఓ అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి.

రామగుండంలో 1×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించాలి: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

గోదావరిఖని, (సమాజహితం) : సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు.

తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం సింగరేణి కార్మికుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.. 76 జీఓను అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా సింగరేణి మారు పేర్ల సమస్యపై కమిటీ ఏర్పాటు చేసి, అర్హులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

సింగరేణి పరిధిలో సుమారు 50 వేల క్వార్టర్లు ఉన్నాయని, వాటిలో సుమారు 28 వేల క్వార్టర్లలో కార్మికులు నివసిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనేక సింగరేణి క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారుతున్నాయని, కొత్తగా ఇళ్ల నిర్మాణానికి తగిన అవకాశాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. గతంలో పరిశ్రమలు, గనుల కారణంగా అభివృద్ధి చెందిన అనేక ప్రాంతాలు ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి, వాటిని కార్మికుల గృహ నిర్మాణానికి వినియోగించే అవకాశం కల్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

కార్మికులకు సుమారు 100 గజాల స్థలం కేటాయించి, వారి హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రయోజనాలను వినియోగించుకునే విధంగా గృహ నిర్మాణానికి అవకాశం కల్పిస్తే సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందుకు అవసరమైన రుణ సదుపాయాన్ని కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రామగుండం నియోజకవర్గానికి మంజూరైన R&B రోడ్ల పనులు టెండర్లు పూర్తయినప్పటికీ ఏడాది కాలంగా ప్రారంభం కాకపోవడంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

రోడ్ల పనులకు టెండర్లు పూర్తయిన తర్వాత రివైజ్ చేసి, కాంట్రాక్ట్ ప్రక్రియ పూర్తిచేసి తిరిగి హైపవర్ కమిటీకి పంపించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా దృష్టి సారించి హైపవర్ కమిటీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.

హైపవర్ కమిటీకి సంబంధించిన ప్రక్రియను వెంటనే క్లియర్ చేసి, రోడ్ల పనులను ప్రారంభిస్తే కనీసం ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభమై ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.

అలాగే రామగుండం ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత కీలకమైన 1×800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులను మరింత ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.