Home

76 జీఓ అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి

76 జీఓ అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి. రామగుండంలో 1×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించాలి: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖని, (సమాజహితం) : సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం సింగరేణి కార్మికుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.. 76 జీఓను అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ...

మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి

మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి మున్సిపల్ చైర్‌పర్సన్‌ మైలారపు లింబాద్రికి నియోజకవర్గ సాధన సమితి వినతి! జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 16 (సమాజహితం): మెట్ పల్లి రైల్వే స్టేషన్‌ గుండా వెళ్లే ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మెట్ పల్లి స్టేషన్ లో హాల్ట్ కల్పించాలని కోరుతూ మెట్ పల్లి నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు. మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పించాల్సిన...

జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా పూడుకారపు నవీన్ రెడ్డి

జగిత్యాల ప్రతినిధి, (సమాజహితం): జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ ఎన్నికలు బుధవారం మెట్ పల్లి లో ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పూడుకారపు నవీన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని పౌల్ట్రీ రంగానికి చెందిన ప్రతినిధులు, సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో నవీన్ రెడ్డికి సభ్యుల నుంచి విశేష మద్దతు లభించడంతో ఆయన ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నవీన్ రెడ్డికి పౌల్ట్రీ రంగానికి...

NSUI తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోట దుర్గరాజ్..సన్మానించిన జువ్వాడి నరసింగా రావు!

జగిత్యాల (సమాజహితం ప్రతినిధి) సెప్టెంబర్ 12: ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోట దుర్గరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జువ్వాడి భవన్ లో శుక్రవారం కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ, కోట దుర్గారాజ్ యువ నాయకుడుగా పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఉన్నత స్థానంలో ఉండాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్ణాకర్ రావు, వెంకట్ రెడ్డి, అందే మారుతి, శ్రీనివాస్ రావు,...

వెల్లుల్ల జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు టీకాలు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం ప్రతినిధి ) : వెల్లుల్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు అందించారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అవసరమైన ఇంజెక్షన్లు వైద్యాధికారి గజాల పర్యవేక్షణలో వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, ఏఎన్‌ఎం సువర్ణ, పాఠశాల హెచ్‌ఎం ఆశలత పాల్గొన్నారు. అలాగే ఉపాధ్యాయులు జగన్, స్వప్న, వసంత, వినయ, లావణ్య, సుమిత్ర, సరస్వతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని...

కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్

జగిత్యాల, సెప్టెంబర్ 11 ( సమాజహితం ప్రతినిధి ) : జగిత్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజా గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి, ఆహారంపై వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, పరీక్షల...

ముందస్తుగా ఇంజనీరింగ్ డే వేడుకలు

జగిత్యాల/ మెట్‌పల్లి, సెప్టెంబర్ 11 ( సమాజహితం ) : మెట్‌పల్లి పట్టణంలో జిందాల్ పాంథర్ స్టీల్ కంపెనీ మీనాక్షి ట్రేడర్ వారి తరపున మెట్‌పల్లి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ముందస్తుగా శుక్రవారం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శశి కుమార్, ఉపాధ్యక్షులు గౌతం, కార్యదర్శి శ్యామ్ సుందర్, సహ కార్యదర్శి...

నూతన బాధ్యతలు పొందిన NSUI నాయకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అభినందనలు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): ఇటీవల NSUI రాష్ట్ర కార్యవర్గంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పోల్కం శివ ఆధ్వర్యంలోని NSUI బృందం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నదయ్యాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నదయ్యా నూతన బాధ్యతలు పొందిన నాయకులను అభినందించారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ విలువైన సూచనలు, ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి...

వినాయక మండపాల నిర్వాహకులకు ఇబ్రహీంపట్నం పోలీసుల సూచన!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): బండ లింగాపూర్ గ్రామంలో ఈరోజు ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కనుగొందుల లక్ష్మీ సంజీవ్ అధ్యక్షతన వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకుల కు పోలీసుశాఖ సూచనలు చేసారు..నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇబ్రహీంపట్నం పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుశాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని, ప్రజా రవాణా, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అనుమతులు, విద్యుత్...

కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ఆందోళన!

కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ఆందోళన! వివాదాస్పదంగా మరీనా 'మట్టి ప్రతిమల' తరలింపు! జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి మెట్‌పల్లికి తరలిస్తున్న మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్‌ చెత్త తరలింపు వాహనంలో తరలించడంపై కలెక్టరేట్ లో బీజేపీ నేతల ఆందోళనకు దారితీసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి పంపిణీ చేసిన మట్టి వినాయక విగ్రహాలను మెట్‌పల్లికి తరలించే క్రమంలో మున్సిపల్‌ చెత్త తరలింపు వాహనాన్ని వినియోగించడం ఈ వివాదానికి దారితీసింది. చెత్త తరలించే వాహనంలో విగ్రహాలను తరలిస్తున్న...

నేటి నుంచి రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె

నేటి నుంచి రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె – ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేతతో ఆర్థిక భారం.. – సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగింపు జగిత్యాల, (సమాజహితం): జిల్లాలో పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జగిత్యాల జిల్లా పారా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణలో జాప్యం, పెండింగ్ బిల్లులు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మిల్లింగ్ ప్రక్రియలోని సమస్యలతో...

22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి

22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ కొడిమ్యాల, సెప్టెంబర్ 10 (సమాజహితం): మండలంలోని సుమారు 24 గ్రామపంచాయతీల పరిధిలో వందల ఎకరాల భూములను 22-ఏ జాబితాలో చేర్చడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం కొడిమ్యాల తహసీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. 22-ఏ సమస్యను అధికారులు తక్షణమే పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించి ప్రజలకు...

ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, సెప్టెంబర్ 10 ( సమాజహితం ) : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులను, అర్బన్ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించి నిర్మాణంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ భవనాలు కీలకమని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని...

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, సెప్టెంబర్ 10 ( సమాజహితం ) : తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందారని, ఆమె త్యాగాలను స్మరిస్తూ ప్రభుత్వం జయంతి, వర్ధంతి...

ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి..!!

భద్రాచలం, సెప్టెంబర్ 09 (సమాజహితం): ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ను కోరారు. బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ గ్రామాలు ఏపీలో ఉండటంతో భద్రాచలం పట్టణానికి పరిపాలన, పారిశుద్ధ్యం, విద్య, శ్మశాన వాటిక తదితర సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా సీతారామచంద్రస్వామి...

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్!

మెట్‌పల్లి, సెప్టెంబర్ 09 (సమాజహితం): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేతశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయనకు హాని కలిగించేలా ప్రజలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులు మెట్‌పల్లి సీఐ గారికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒక మీడియా కార్యక్రమంలో ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి శ్రీ కేసీఆర్ గారిపై అత్యంత అభ్యంతరకరమైన...

ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 09 (సమాజహితం): గత రెండు రోజులుగా తెలంగాణ శాసనసభ, శాసనమండలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలను యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే తమ బతుకులు మారేలా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని తెలంగాణ ప్రజలు, వివిధ వర్గాల ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, అసెంబ్లీని ఈ రెండు పార్టీలు తమ వ్యక్తిగత దూషణలకు, రాజకీయ...

వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం!

వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం! దేవాదాయ ధర్మాదాయ శాఖ వెల్లుల్ల గ్రామము మెట్పల్లి మండలం జగిత్యాల జిల్లా శ్రీ ఎల్లమ్మ దేవాలయం లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలో తేదీ. 08-09-2026 ఈరోజు వివిధ సేవ టికెట్స్ ద్వారా వచ్చిన ఆదాయము 19666=00 ( అక్షరాల పందోమ్మిది వేయిల అరు వందల అరువై ఆరు రూపాయలు వచ్చినది మరియు ఈరోజు అమ్మవారి హుండీలు విప్పి లెక్కించగా వచ్చిన ఆదాయము 8364=00 (అక్షరాల ఎనిమిది వేయిల ముడూవందల అరువైయి నాలుగు రూపాయలు...

మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా!

మెట్‌పల్లి, సెప్టెంబర్ 05 (సమాజహితం) : విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపడతామని, విద్యార్థులకు స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందని ఎమ్మెల్యే విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే GO 97ను వెంటనే రద్దు చేయాలని...

'లీసా’ సినిమా షూటింగ్ పూర్తి

ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు...